తాడ్వాయిలో పాడిపశువులకు గాలికుంటూ టీకా కార్యక్రమం ప్రారంభంలో జిల్లా డిప్యూటీ కలెక్టర్

తాడ్వాయిలో పాడిపశువులకు గాలికుంటూ టీకా కార్యక్రమం ప్రారంభంలో జిల్లా డిప్యూటీ కలెక్టర్

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి జిల్లాఅక్టోబర్ 15:

తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామంలో పాడిపశువులకు గాలికుంటూ నివారణ టీకా కార్యక్రమాన్ని శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7వ విడత గాలికుంటూ నివారణ టీకాలను పాడిరైతులు తప్పనిసరిగా తమ పశువులకు వేయించుకోవాలని సూచించారు. రోగం వస్తే పశువుల పాల దిగుబడి గణనీయంగా తగ్గి, పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందని తెలిపారు.

జిల్లాలోని అన్ని గ్రామాల్లో నేటి నుండి నవంబర్ 14 వరకు పశు సంవర్ధక శాఖ సిబ్బంది టీకాలు ఇవ్వనున్నారని ఆయన చెప్పారు.

జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి డా. భాస్కరన్ మాట్లాడుతూ గాలికుంటూ రోగం వస్తే పశువుల కాళ్ల గెటికెల్లో, నోటిలో పుండ్లు ఏర్పడి మేత మేక పాల ఉత్పత్తి తగ్గడం, మరణించే ప్రమాదం కూడా ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, మండల పశువైద్య అధికారి డా. రమేష్, పోచయ్య (VLO), బి. కొండల్ రెడ్డి (JVO), ప్రేమ్ సింగ్ (JVO), గోపాల మిత్రలు, విజయ డైరీ డైరెక్టర్ మైసగౌడ్, సెక్రటరీ అనిల్ రెడ్డి, పాడిరైతులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment