ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు నిర్మాణానికి నిధులు మంజూరు – జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు

ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలలు నిర్మాణానికి నిధులు మంజూరు

– జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు

-ప్రశ్న ఆయుధం కామారెడ్డి

ప్రభుత్వ జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత, ఉన్నత (83) పాఠశాలల్లో చదువుతున్న బాలికల విద్యార్థుల కోసం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద (114) మూత్రశాలలు నిర్మించడానికి యుద్ధ ప్రాతిపదికన 228.00 లక్షల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ మంజూరు చేయడం జరిగిందనీ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని నిర్మాణం త్వరలో చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందుకు గాను జిల్లా విద్యాశాఖ పక్షాన, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.రాజు జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

 

 

.

Join WhatsApp

Join Now