తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి ఉన్నత పాఠశాలలో ప్రజ్ఞోత్సవం  – హాజీరైన జిల్లా విద్యాశాఖ అధికారి 

తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి ఉన్నత పాఠశాలలో ప్రజ్ఞోత్సవం

– హాజీరైన జిల్లా విద్యాశాఖ అధికారి

IMG 20250222 WA0069

ఆయుధం కామారెడ్డి

తిమ్మయ్య గారి సుశీల నారాయణరెడ్డి ఉన్నత పాఠశాల బాలురు బిబిపేటలో శనివారం బిబిపేట కాంప్లెక్స్ పరిధిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూల రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో కృత్యమేల, ప్రజ్ఞోత్సవం నిర్వహించడం జరిగింది. పాఠశాల సముదాయంలోని 19 పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ స్పెల్ బి రీడింగ్ కాంపిటీషన్స్ క్విజ్ మొదలైన పోటీలు నిర్వహించారు. ఉపాధ్యాయులు వివిధ అంశాలకు సంబంధించిన కృత్యాలను ప్రదర్శించారు. వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ మండలంలోని పాఠశాలలన్నీ నృత్యమేళాలు చాలా చక్కగా చేశారని ఈ కృత్యాలన్నిటిని పాఠశాలల్లోని విద్యార్థులకు నిర్వహించి పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులకు 100 శాతం ఉత్తీర్ణులు రావడానికి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీ వేణుగోపాల్ శర్మ, డిస్ట్రిక్ట్ సైన్సు ఆఫీసర్ సిద్ధిరామిరెడ్డి, మండల విద్యాధికారి అశోక్, మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now