అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకటేశ్వర చారి
గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులుజారె ఆదినారాయణ ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాడీఈఓ యం.వెంకటేశ్వర చారి సెక్టోరియల్ ఆఫీసర్ ఎస్.కె సైదులు , దమ్మపేట మండల ఎంఈఓ కీసరి లక్ష్మీ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని విద్యాశాఖ అభివృద్ధి గురించి పలు ముఖ్యమైన విషయాలపై చర్చించారు అనంతరం నియోజకవర్గ వికలాంగుల సౌకర్యార్థం భవిత కేంద్రాన్ని ప్రారంభించాలని ఎమ్మెల్యే కి జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతిపాదించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పకుండా భవిత కేంద్రాన్ని నిర్మించడానికి తన నుంచి సహాయ సహకారాలు ఉంటాయని త్వరలోనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి నిధులు సమీకరించి నియోజకవర్గంలోని వికలాంగులకు బయట భవిత కేంద్రం అందుబాటులోకి తీసుకొస్తానని హామీకి ఇచ్చారు.