సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రామ పంచాయతీ మూడవ విడత నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మొదటి, రెండవ విడతలలో 17 మండలాలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ సజావుగా పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ నెల 3నుండి 5వ తేదీ వరకు మూడవ విడతగా కల్హేర్, కంగ్టి, మనూరు, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, సిర్గాపూర్, న్యాల్కల్ మండలాల పరిధిలోని 234 గ్రామ పంచాయతీలు,1960వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఉదయం 10:30గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చని తెలిపారు. డిసెంబర్ 5 చివరి తేదీ అని కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాఫీగా జరిగేలా అన్ని వర్గాల వారు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.
డిసెంబర్ 3నుండి మూడవ విడత నామినేషన్ల స్వీకరణ: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య
Updated On: December 2, 2025 7:53 pm