పరిశుభ్రతపై అవగాహన కల్పించిన జిల్లా ఆరోగ్య, వైద్యశాఖ అధికారి 

పరిశుభ్రతపై అవగాహన కల్పించిన జిల్లా ఆరోగ్య, వైద్యశాఖ అధికారి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 13

పాల్వంచ మండలంలోని భవానిపేట గ్రామంలో కిసాన్ నగర్ కాలనీలో మాచారెడ్డి పి హెచ్ సి డాక్టర్

ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఆరోగ్య, వైద్యశాఖ అధికారి చంద్రశేఖర్ హాజరై పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ వర్షాకాలంలో నిరు ఎక్కవ నిల్వ ఉండకుండా చూసుకోవాలని, నిరు నిల్వ ఉన్నట్లయితే దోమలు వృద్ధి చెంది వాటి వల్ల వివిధ రకాల రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన విధంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

అనంతరం ప్రజలకు డెంగ్యూ, మలేరియా తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి, పాల్వంచ మండలాల వైద్య సిబ్బంది సుశీల, సూపర్వైసర్ గీత, ల్యాబ్ టెక్నీషియన్ అరుణ, భవానిపెట్ సిబ్బంది ఎంఎల్ హెచ్పి, ఎం.శ్రీకాంత్, ఏఎన్ఎం సుమలత, పద్మ, ఆశా వర్కర్ లు ఇందిరా, లత ,వసంత తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now