ఓటు వజ్రాయుధం లాంటిది జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ.

ఓటు వజ్రాయుధం లాంటిది జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ.

 ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని,18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించి ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ అన్నారు.గురువారం స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటరు నమోదుపై అవగాహన కల్పించేందుకు డిఆర్డిఏ అధికారులు నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో కలిసి రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నుంచి శ్రీపురం చౌరస్తా వరకు రన్ నిర్వహించారు. అనంతరం నోడల్ అధికారి మాట్లాడుతూ

18 ఏళ్ల వయసుపై బడిన యువకులు ఓటు హక్కును పొందాలన్నారు.ప్రజలకు ఓటు అనేది ఒక

వజ్రాయుధమన్నారు. ఓటుహక్కును రాజ్యాంగం మనకు కల్పించిన హక్కన్నారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ తహసిల్దార్ తబిత, ఎంపీడీవో కోటేశ్వరరావు, భాస్కర్ రెడ్డి డిఆర్డిఏ అధికారులు అరుణ దేవి సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment