*వెస్లీ పాఠశాలలో 337 అంశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ వైజ్ఞానిక ప్రదర్శన-2024 అట్టహాసంగా నిర్వహణ*
*జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా విద్యాధికారి రాధా కృష్ణ*
మెదక్ జిల్లా పాఠశాలల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న
జిల్లాస్థాయి సైన్స్ ఫైర్
ప్రదర్శన-2024 అట్టహాసంగా నిర్వహించిన జిల్లా విద్యాధికారి,జిల్లా కలెక్టర్
మెదక్ పట్టణంలో వెస్లీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి సైన్స్ ఫైర్
వైజ్ఞానిక ప్రదర్శన-2024 వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది.ఈ కార్య క్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,సంబంధిత ఉపాధ్యాయ సంఘ ప్రతిని ధులు,ప్రజా ప్రతినిధులు,వివిధ పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.సైన్స్ ఫైర్ వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని శ్రాస్తవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ అన్నారు.విద్యార్థులు సైన్స్,గణితాన్ని ఇష్టపడి చదివి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాల న్నారు.సమస్యకు పరిషారం చూపడానికి,నూతన ఆవిష్కరణలకు సైన్స్, గణితము దోహదపడుతా యన్నారు.సైన్స్ ఫైర్ వైజ్ఞానిక విద్యార్థులు ప్రదర్శనలో చూపించిన అంశాలను వాటిని ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పుడే ఫలితాలు ఉంటాయన్నారు.విద్యార్థినీ, విద్యార్థులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పాటు విజ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పారు. ఆహారం,ఆరోగ్యం,పరిశుభ్రత -53,సహజ వ్యవసాయం-42, రవాణా కమ్యూనికేషన్-70, విపత్తుల నిర్వహణ-43, వ్యర్ధాల నిర్వహణ-45,గణిత నమూనా-48, సైన్స్ పైర్ -36
అంశాలలో విద్యార్థినీ, విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని జిల్లా కలెక్టర్ అన్నారు.అంతకుముందు కలెక్టర్ వైజ్ఞానిక ప్రదర్శనలో పిల్లలు ప్రదర్శించిన అంశాలను పరిశీలించి వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుమల సుహాసినిరెడ్డి,ఎమ్మెల్సీ రగోత్తం రెడ్డి,జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ,జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి,జడ్పీ సీఈఓ ఎల్లయ్య,అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి,ఎంఈఓ నీలకంఠం,జిల్లాస్థాయి వివిధ ఉపాధ్యాయ అధ్యక్ష,ప్రధాన కోశాధికారులు తదితరులు పాల్గొన్నారు.