అంతర్జాతీయ యోగా దినోత్సవం: పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ*

*అంతర్జాతీయ యోగా దినోత్సవం: పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ*

 

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 18

 

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ ఉమా గౌరి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవితో కలిసి అంతాయపల్లిలోని ఇంటిగ్రేటెడ్ జిల్లా కార్యాలయ సముదాయంలోని జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో ఈ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ ఉమా గౌరి మాట్లాడుతూ, జూన్ 21, 2025న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాలలో విస్తృతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. యోగా ప్రయోజనాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సంబంధిత వైద్య అధికారులు మరియు సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ కార్యక్రమ పరివీక్షకులు డా. శ్రీవల్లి, ఆయుర్వేద సీనియర్ వైద్య అధికారి డా. జంగయ్య, ఆయుర్వేద వైద్య అధికారి డా. శ్రీదేవి, ఆయుర్వేద ఫార్మసిస్ట్ భిక్షపతి, డేటా ఎంట్రీ ఆపరేటర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment