సంగారెడ్డి, అక్టోబర్ 12 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేసేలా చూడాలని జిల్లా వైద్యాధికారి నాగనిర్మల వైద్య సిబ్బందికి సూచించారు. ఆదివారం ఉదయం హత్నూర మండలం దౌల్తాబాద్ బస్టాప్, హత్నూరలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు తప్పకుండా పోలియో చుక్కలు వేయాలని తెలిపారు. ఇదిలా ఉండగా చింతల్ చెరు గ్రామంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని డీఐఓ శశాంక్ పరిశీలించారు. వీరి వెంట హత్నూర పీహెచ్ సీ డాక్టర్ రజిని తదితరులు ఉన్నారు.
చుక్కల మందు తప్పని సరి: జిల్లా వైద్యాధికారి నాగనిర్మల
Oplus_131072