జిల్లా పోషణ మాస ఉత్సవం ఘనంగా

జిల్లా పోషణ మాస ఉత్సవం ఘనంగా

పోషణలోపం లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం 

– జిల్లా సంక్షేమ అధికారి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 31

జిల్లా కేంద్రంలోని ఐడాక్‌ హాల్‌లో శుక్రవారం జిల్లా పోషణ మాస ఉత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో, సీడీపీఓలు, ఐసీడీఎస్‌ సూపర్వైజర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఎంఫీహెచ్ఎస్‌, ఏయిమ్స్‌ అధికారులు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లాను పోషణలోపం లేని జిల్లాగా మార్చేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోషణలోపం ఉన్న చిన్నారులను గుర్తించి వారికి ఆకలి, ఆరోగ్య పరీక్షలు చేయాలని, ఈ పరీక్షల్లో హెల్త్‌ డిపార్ట్మెంట్‌ సక్రియంగా పాల్గొనాలని సూచించారు.

SSFP కార్యక్రమం కింద 10 స్టెప్స్‌ శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించబడింది. పిల్లల అభివృద్ధిని పర్యవేక్షించి, NHTS యాప్‌లో ICDS శాఖ అధికారులు మరియు ఆరోగ్య శాఖ అధికారులు MCH పోర్టల్‌లో సకాలంలో వివరాలు ఎంట్రీ చేయాలని తెలిపారు. SAM, MAM పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు.

తర్వాత కార్యక్రమంలో పాల్గొన్నవారంతా పోషణ మాసం ప్రతిజ్ఞ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment