మైనారిటీ గురుకులం సందర్శించిన జిల్లా అధికారి
విద్యార్థులతో భోజనం చేసిన జయరాజ్
సేవల పట్ల సిబ్బందిని అభినందన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 11
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల కళాశాలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జయరాజ్ మంగళవారం సందర్శించారు.
మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ సందర్శనలో ఆయన వంటగది, భోజనశాల, హాస్టల్ వసతులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి వసతులపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి, విద్యార్థులను ప్రోత్సహించారు.
గురుకుల నిర్వాహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన అధికారి, మంచి సేవలు కొనసాగించాలని సిబ్బందిని సూచించారు.