ప్రకృతి పరిరక్షణకు జిల్లా పోలీసుల ముందడుగు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 22
వనమహోత్సవం లో భాగంగా మొక్కల నాటింపు, ప్రకృతి పరిరక్షణకు జిల్లా పోలీసుల ముందడుగు చెట్లు ప్రాణవాయువు అందజేస్తాయి. పచ్చదనమే భవిష్యత్తు
జిల్లాలోని అధికారులు మరియు సిబ్బందితో కలిసి, హెడ్‌క్వార్టర్స్‌లో మొక్కలు నాటిన జిల్లా ఎస్పీయం. రాజేష్ చంద్ర, ఐపీఎస్,
వనమహోత్సవం సందర్భంగా “భవిష్యత్ తరాల కోసం పచ్చదాన్ని పెంపొందిద్దాం, ప్రాణవాయువును అందరికీ అందిద్దాం” అనే సంకల్పంతో, కామారెడ్డి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్‌్ులో మొక్కలు నాటే కార్యక్రమం జిల్లా పోలీసు అధికారి యం. రాజేష్ చంద్ర, ఐ.పి.ఎస్ నేతృత్వంలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్, ఎల్లారెడ్డి డీఎస్పీ వై. శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, ఎస్‌ఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొని మొక్కలు నాటినారు.