జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో నీల నాగరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కులగణన చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.సమగ్ర కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచాలి అని,కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని అన్నారు.కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన బీసీ జనగణన విషయమై ఇప్పటి వరకు ప్రభుతం స్పందన లేదని విమర్శించారు.కులగణన వెంటనే చేయకపోతే ప్రభుత్వం గద్దె దింపే వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.కులగణన చేపట్టి రిజర్వేషన్లు పంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంబీసీ సంఘం జిల్లా అధ్యక్షులు మఠం విజయ్ కుమార్,టౌన్ అధ్యక్షులు మాయాప్రసాద్,జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్,దయాకర్,నాయకులు రమేష్,నరేష్,ప్రవీణ్,రాజేందర్,యోగేష్,ప్రశాంత్,శ్రీధర్,సచిన్ తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర కులగణన చేయాల్సిందే:బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు..
by admin admin
Published On: August 24, 2024 9:05 pm