సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): పని ప్రదేశంలో మహిళా సిబ్బందితో మర్యాదగా నడుచుకోవాలని, ఇతరుల పట్ల గౌరవం అనేది మొదటగా మన నుండి ప్రారంభం కావాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సూచించారు. శనివారం నాడు రుద్రారం గీతం ఇంజినీరింగ్ కాళాశాలలో ఏర్పాటు చేసిన పైనాన్షియల్ మేనేజ్మెంట్, వర్క్ ప్లేస్ లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపుల గురించి సిబ్బందికి ఒక రోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ.. వర్క్ ప్లేస్ లో మహిళా సిబ్బందితో మర్యాదగా నడుచుకోవాలని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. నూతన చట్టాల ప్రకారం మహిళలపై జరుగుతున్న నేరాలకు కఠిన శిక్షలు ఉన్నాయని గుర్తుచేశారు. అదే విధంగా పోలీసు స్టేషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా మాట్లాడాలని, పోలీసు శాఖకు మంచి పేరు రావాలంటే గ్రౌండ్ లెవెల్ లో ప్రజలకు దగ్గరగా ఉండే సిబ్బంది ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటుందని ఎస్పీ రూపేష్ అన్నారు. పైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ… మొదటి నుండే పైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఒక సిస్టమేటిక్ గా/క్రమ బద్దమైన ప్లాన్ ను కలిగి ఉండాలని, ఏది అవసరం, ఏది అత్యవసరం అనేది గుర్తెరిగి డబ్బులు ఖర్చు చేయాలని అన్నారు. అనవసరంగా అత్యాశకు పోయి డబ్బులు రెట్టింపు అవుతాయని, ఇతర సామాజిక మాద్యమాలలో వచ్చే అసత్యపు మాటలను నమ్మి మోసపోరాదని తెలిపారు. అనవసర లోన్ యాప్ ల జోలికి వెళ్లరాదని, మన అవసారాన్ని బట్టి ముందుకు వెళ్లాలని సూచించారు. అనంతరం పైనాన్షియల్ మేనేజ్మెంట్ సలహాదారు రూప్ కుమార్ (సి.ఎ) మాట్లాడుతూ.. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేయడం వలన లాభాలు పొందవచ్చు అని, ఇన్ కం టాక్స్ రిటర్న్ ఏవిధంగా ఫైల్ చేయాలి, అనే మెలకువలతో పాటు సిబ్బంది అడిగిన సందేహాలకు వివరణతో కూడిన సమాధనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవ రావ్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఇ.కళ్యాణి, డీఎస్పీలు రవీందర్ రెడ్డి, సత్తయ్య గౌడ్, రామ్మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, జిల్లా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు ఎస్బీ ఇన్స్పెక్టర్స్ విజయ్ కృష్ణ, డీసీర్బి ఇన్స్పెక్టర్స్ రమేశ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.