Site icon PRASHNA AYUDHAM

పథకాలు సాధించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ

IMG 20250207 WA03981

పథకాలు సాధించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ

– పోలీసు క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 లో పతకాలు సాధించిన జిల్లా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపిఎస్ గురువారం జిల్లా కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలన్నారు.
కరీంనగర్‌లో జనవరి 28 నుండి ఫిబ్రవరి 1 వరకు జరిగిన 3వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2025 క్రీడాల్లో జిల్లాకి చెందిన క్రీడాకారులు 02 బంగారు పతకాలు, 05 -రజత మరియు 03-కాంస్యం పతకం సాధించారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన పోలీస్ క్రీడాకారులు జిల్లా ఎస్పీ సింధు శర్మ ఐపిఎస్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా, జోనల్ స్థాయిలో ఉత్తిమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించినందుకు ముందుగా క్రీడాకారులకు అభినందనలు లియజేసి బహుమాతులను అందజేశారు. ఇదే స్పూర్తిని కనబరుస్తూ రాబోయే రోజుల్లో జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పథకాలు సాధించిన వారిలో తిరుపతి, బాలరాజ్ కె అంకుష్ ఎన్ హరిచంద్ రాజేష్ పి ప్రవీణ్ ప్రభు తదితరులున్నారు.
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పి యాకూబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ పతకాలు సాధించిన క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version