నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పి.*

*నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పి.*

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 22

 

 

*• పెండింగ్ లో ఉన్న కేసుల గురించి డి‌ఎస్‌పి, సిఐలను, ఎస్ఐలను, అడిగి కేసు ఫైల్స్ ను పరిశీలించడం జరిగినది*

*• ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి..*

*• లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి.*

*• రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.*

*• పోలీస్ అధికారులు సిబ్బంది ప్రతిరోజూ గ్రామాలను సందర్శించాలి.*

*• సైబర్ క్రైమ్ గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి..*

*• నెలవారీ సమీక్ష సమావేశంలో భాగంగా అధికారులకు పలు సూచనలు చేసిన..*

_*జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్*_

 

మంగళవారం రోజున జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా స్థాయి పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం, నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష చేస్తూ, ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో SOP ప్రకారం నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు జరగాలని ఆయన సూచించారు.

విపీఓలు, గ్రామాల్లో సందర్శించినప్పుడు ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలతో కలిసి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి, సమాచారం వేగంగా చేరేలా చూడాలని సూచించారు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా పరిశీలించి, రిపేర్ అవసరమైతే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. గొడవలకు కారణమయ్యే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, చిన్న ఘటనకైనా సమాచారం వచ్చే విధంగా గ్రామస్థులతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

_రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఫ్రీ & ఫెయిర్ ఎన్నికల నిర్వహణే లక్ష్యం.

ప్రతి పోలీస్ అధికారి గ్రామాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి.

సోషల్ మీడియాలో అసాంఘిక ప్రచారంపై పటిష్ట నిఘా ఉంచాలి. చెడు ప్రవర్తన గల వారిపై బైండోవర్ చర్యలు తీసుకోవాలి.

పోలీసులు ప్రజలతో మమేకమై సమాచారం సేకరించి, ఎన్నికల వాతావరణాన్ని భద్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది అని జిల్లా ఎస్పీ అన్నారు.

డయల్ 100 ద్వారా కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని, సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు రెగ్యులర్‌గా నిర్వహించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం తగదు అని స్పష్టం చేశారు.

అనంతరం జిల్లా ఎస్పీ ఎస్‌హెచ్‌ఓ, వాహనాలను తనిఖీ చేస్తూ, ప్రతి వెహికల్‌ను రెగ్యులర్ సర్వీస్ చేయించాలని, ఎలాంటి రిపేర్స్ ఉన్నా తక్షణమే నివృత్తి చేస్తూ, వెహికల్ పూర్తి స్థాయిలో కండిషన్‌లో ఉండే విధంగా చూసుకోవాలని డ్రైవరులకు సూచించారు. ఈ వాహనాల తనిఖీలలో వెహికల్ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, అడ్మిన్ ఆర్‌ఐ సంతోష్, ఉన్నారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కే. నరసింహారెడ్డి, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్, డీఎస్పీలు శ్రీనివాసరావు, విట్టల్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఇతర సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment