Site icon PRASHNA AYUDHAM

జిల్లా భరోసా సెంటర్ లో ఔట్ సౌర్సింగ్ పద్ధతిపై పని చేయుటకు 3 ఖాళీలు. – జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,

*జిల్లా భరోసా సెంటర్ లో ఔట్ సౌర్సింగ్ పద్ధతిపై పని చేయుటకు 3 ఖాళీలు. – జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,*

వికారాబాద్ జిల్లా భరోసా సెంటర్ లో ఔట్ సౌర్సింగ్ పద్ధతిపై పని చేయుటకు 3 ఖాళీలు ఉన్నాయి అందుకు గాను అర్హత కలిగి ఆసక్తి గల మహిళా అభ్యర్థులు జిల్లా పోలీస్ కార్యలయంలోని భరోసా కేంద్రం నందు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్‌పి కె.నారాయణ రెడ్డి, తెలిపినారు. అందుకు సంబందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

సెంటర్-కొ-ఆర్డినేటర్(1), సపోర్ట్ పర్సన్(2), ఈ ఉద్యోగ నియామకాలు ఒక సంవత్సరం కాలవ్యవధి కొరకు మాత్రమే.

అదే కాలవ్యవధిలో ఆవశ్యకత బడ్జెట్ ప్రకారం ప్రతి సంవత్సరం పొడిగించబడుతుంది. నియామకం మొత్తం డి బిజినెస్ సోలుషన్స్ ఏజెన్సీ నుంచి జరుగుతాయి. 

బయో-డేటా, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్,అనుభవం సర్టిఫికెట్స్, అడిగిన పత్రాలు అన్ని మెయిల్ dbusinesssolutionzz@gmail.com ద్వారా, లేదా వాట్సాప్ 8712670063 ద్వారా పంపగలరు అని తెలియజేయడం జరిగిగింది.

*అర్హత నిబంధనలు*

1.సెంటర్-కొ-ఆర్డినేటర్(1) కి ఏం.ఎ/ఎం ఎస్ సి/ సైకాలజీ విద్యార్హత కల్గి 2 సంవత్సరాల అనుభవం కల్గి ఉండాలి. రెమ్యూనరేషన్ 30,000 రూపాయలు.

2. సపోర్ట్ పర్సన్(2) కి Master of Social Work (MSW) విద్యార్హత కల్గి ఒక సంవత్సరం అనుభవం కల్గి ఉండాలి. రెమ్యూనరేషన్ 20,000 రూపాయలు.

Exit mobile version