విధి నిర్వహణలో రక్షణ, కుటుంబానికి భరోసా: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): హోంగార్డ్ సిబ్బందికి ఆరోగ్య, ఆర్థిక భద్రత కొరకు అదనపు డిజి-హోంగార్డ్ స్వాతి లక్రా ఆదేశానుసారం శుక్రవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో హెచ్.డి.ఎఫ్.సి, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో హోంగార్డ్ సిబ్బందికి ప్రమాద, ఆరోగ్య భీమాపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమలో సంబంధిత బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. తమ బ్యాంక్ లలో హోంగార్డ్ శాలరీ అకౌంట్ కలిగి ఉండి, అకౌంట్ హోల్దెర్స్ ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 40లక్షల రూపాయల భీమా లభిస్తుందని అన్నారు. బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ లో సంవత్సరానికి హోమ్ గార్డ్స్ 11,650 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే, కుటుంబంలోని నలుగురు (భార్య/భర్తతో పాటు ఇద్దరు పిల్లలకు) సభ్యులకు భీమా వర్తిస్తుందని, ఏదైనా ప్రమాదం జరిగితే నలుగురు సభ్యులకు కలిసి సంవత్సరానికి 33లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమా, చికిత్సకు ముందు 3-నెలలు, చికిత్స అనంతరం 6-నెలల వరకు చెల్లించిన మెడికల్ బిల్లుల తిరిగి చెల్లించెల భీమా సదుపాయం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో హోంగార్డ్స్ కీలక పాత్ర పోషిస్తారని, వారి ఆరోగ్యం, ఆర్థిక భద్రత మా బాధ్యత అన్నారు. ఆరోగ్య భీమా మీకు, మీ కుటుంబానికి రక్షణగా ఉంటుందని, చిన్న సమస్యలు పెద్ద భారం కాకుండా ఆరోగ్య భీమా తీసుకొని ధీమాగా ఉండాలని ఎస్పీ అన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు కల్పించే సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఎవరి ప్రోద్బలం లేకుండా స్వచ్ఛందంగా భీమా చేసుకోవాలని అన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరు ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని మద్యం, ఆన్లైన్ గేమ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు.ఎస్పీ సిహెచ్. రఘునందన్ రావు, ఆర్ఐలు డానియెల్, రాజశేఖర్ రెడ్డి, హెచ్.డి.ఎఫ్.సి, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్స్, బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ రిజినల్ మేనేజర్ హోంగార్డ్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment