సంగారెడ్డి జిల్లా పోలీసు ఐటీ ల్యాబ్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గల ఐటీ ల్యాబ్ లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ సెల్ సిబ్బంది విధులను గురించి అడిగి తెలుసుకున్నారు. టెక్నికల్ పరంగా ఐటి సెల్ అనేది జిల్లాకు వెన్నెముక వంటిదని, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో జిల్లా పోలీసు శాఖ మరింత మెరుగ్గా పనిచేయడానికి ఐటీ సిబ్బంది సేవలు కీలకం అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్ లలో ఎలాంటి టెక్నికల్ సమస్య తలెత్తిన క్షణాలలో నివృత్తి చేసేవిధంగా నైపుణ్యతను కలిగి ఉండాలని సిబ్బందికి సూచనలు చేశారు. మిస్సింగ్, కిడ్నాప్ కేసులలో లొకేషన్స్ ఆధారంగా కేసులను చేధించడంలో, సైబర్ నేరాలలో బాధితులు కోల్పోయిన డబ్బులను హోల్డ్ చేయటం, తిరిగి బాధితులకు అందించడం మరియు మాదకద్రవ్యాల నిర్మూలనలో ఐటి సెల్ సిబ్బంది సేవలు మరువలేనివని అన్నారు. ఆయా విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు అందించడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు. వీరి వెంట నందు ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఐటీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now