సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి రూరల్ పోలీసు స్టేషన్ ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డ్ లైన ఆర్డర్ బుక్, డ్యూటి రోస్టర్, పార్ట్-ii మ్యాప్ లను తనిఖీ చేశారు. అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ గురించి, ప్రజలకు అవగాహన కల్పించాలని, సైబర్ మోసగాళ్ళ పన్నిన తప్పుడు ఆఫర్లు, ఫేక్ లైక్స్ జోలికి వెళ్లకుండా అవగాహన కల్పించాలని అన్నారు.స్టేషన్ పరిధిలో గల హిస్టరీ షీటర్లు కదలికలపై నిఘా ఉంచామని, తరుచూ వారిని చెక్ చేయాలని సూచించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అధికారులు సిబ్బంది 24*7 అందుబాటులో ఉండాలని, దూర ప్రాంతాల నుండి ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ ఇతరులకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment