అంబేద్కర్ కు నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ భారత రత్న, ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, అంటరానితనం నిర్మూలనకు కృషి చేసిన మహనీయుడు, స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి, రాజ్యాంగ శిల్పి, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన అవిశ్రాంత కృషి మరియు సమ్మిళిత సమాజాన్ని నిర్మించడంలో ఆయన కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆ మహానీయులను స్మరింస్తూ.. మాతృదేశానికి మన వంతు సేవ చేయడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. యువత అంబేద్కర్ జీవితం మరియు బోధనల నుండి ప్రేరణ పొంది, రాజ్యాంగంలో పొందు పరచబడిన సమానత్వం, స్వేచ్ఛ మరియు సోదరభావం యొక్క విలువలను నిలబెట్టడానికి కృషి చేయాలని తెలిపారు. అంబేద్కర్ జయంతి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎ.సంజీవరావ్, ఏఆర్.డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, డానియోల్, యస్.బి. ఎస్ఐ యాదవ రెడ్డి, డీసీఆర్బీ ఎస్ఐ బక్కయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment