Site icon PRASHNA AYUDHAM

హోలీ పండుగను సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

IMG 20250313 170627

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): హోలీ పండుగను సంప్రదాయ పద్ధతుల్లో సహజ సిద్ధమైన రంగులతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు హోలీ పండగను సంప్రదాయ పద్ధతుల్లో ప్రకృతిలో లభించే, చర్మానికి, పర్యావరణానికి హాని కలిగించని న్యాచురల్ కలర్స్ ను వినియోగించి, ప్రశాంత వాతావరణంలో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం, బహిరంగ ప్రదేశాలపై, ఇష్టం లేని వ్యక్తులపై, వాహనాలపై రంగులు, రంగు నీళ్లు చల్లకూడం వంటివి చేయకూడదని అన్నారు. బైకులపై, కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే అలాంటి వ్యక్తులపై చట్టరిత్య చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల కార్యకలాపాలను తరుచూ గమనిస్తూ వారికి సరైన మార్గాలను నిర్దేశించాలన్నారు. యువత వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, రేష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, లాంటివి మానుకోవాలని సూచించారు. హోలీ పండగ సందర్భంగా ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా సున్నిత ప్రదేశాలలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు వివరించారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో 100 డయల్ చేయాలని సూచించారు. ఈ హోలీ మీ జీవితాలలో రంగులు నింపాలని కోరుకుంటూ సిబ్బందికి, సంగారెడ్డి జిల్లా ప్రజలకు హోలీ పండగ శుభాకాంశాలు తెలియజేశారు.

Exit mobile version