సంగారెడ్డి ప్రతినిధి, జూలై 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా సింగూర్ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో, ప్రస్తుత నీటి మట్టం వివరాలు, ప్రమాద కారణాల దృష్ట్యా భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుండపోతలా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదని అన్నారు. ప్రమాద కారణాల దృష్ట్యా ప్రజలెవ్వరూ లోతట్టు ప్రాంతాలను, జలాశయాలు, చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుందన్నారు. అత్యవసర సమయంలో డైల్ 100 లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656739 ను సంప్రదించవలసిందిగా సూచించారు. జిల్లా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు కుంటలకు ఎవ్వరూ వెళ్ళకుండా ప్రమాద సూచిక బోర్డ్ లను ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. యస్.హెచ్.ఓ.లు ప్రత్యేకంగా తమ తమ ఏరియాలో ఉన్న చెరువులు కుంటలను సమర్శించి, ప్రమాద అంచున ఉన్న ఆనకట్టల సమాచారం అందించవలసిందిగా సూచించారు. వీరి వెంట ఇరిగేషన్ ఏఈ , పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ తదితరులు ఉన్నారు.
*భారీ వర్షాల దృష్ట్యా పాటించవలసిన జాగ్రత్తలు..*
*అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.
*ప్రమాద కారణాల దృష్ట్యా చెరువులు, కుంటలను చూడటానికి వెళ్లారాదు.
*రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి.
*విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ చేతులతో తాకకకూడదు.
*నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు.
*వాగులు వంకలు బ్రిడ్జ్ లపై నుండి పొంగి, ప్రవహించే సమయంలో దాటాడానికి
ప్రయత్నించరాదు.
*పాడైన పాత భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల ప్రక్కన నివాసం ఉండరాదు.