Site icon PRASHNA AYUDHAM

జిల్లా వ్యాప్తంగా ఉన్న బంగారం దుకాణాలలో భద్రత పెంచాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

IMG 20250826 185305

Oplus_131072

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లా వ్యాప్తంగా ఉన్న బంగారం దుకాణాలలో భద్రత పెంచాలని, సీసీ కెమెరాలను, వాల్ సెన్సార్ లను ఏర్పాటు చేసి, భద్రతను బలోపేతం చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న బంగారం దుకాణాల భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో సుమారు 150 మంది బంగారం దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని బంగారం దుకాణాలలో సీసీ కెమెరాలు, వాల్ సెన్సార్లు, అలారమ్ వ్యవస్థలను తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని, లైసెన్స్డ్ ఆయుధాలు కలిగిన సెక్యూరిటీని నియమించుకోవాలని సూచించారు. అపరిచిత లేదా అనుమానిత వ్యక్తుల నుండి బంగారం కొనుగోలు చేయరాదని, దొంగసొత్తుకు సంబంధించిన ఆనవాళ్లను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. దుకాణ భద్రత, ఆర్థిక లావాదేవీల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించవద్దని, జిల్లా పోలీసు అధికారుల ఫోన్ నెంబర్స్ కలిగి ఉండాలని, అత్యవసర సమయంలో డైల్ -100 చేయాలన్నారు. జిల్లాలో నేరాలను అరికట్టడంలో పోలీసులకు సహకరించాలని, భద్రతా చర్యలు ప్రతి ఒక్కరూ అమలు చేయాలని జిల్లా ఎస్పీ గారు దుకాణదారులను కోరారు. ఈ సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, వివిధ గోల్డ్ షాప్ లకు చెందిన సుమారు 150 మంది యజమానులు, గోల్డ్ స్మిత్ లు తదితరులు పాల్గొన్నారు.
Exit mobile version