సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): విద్యార్థులు చిన్నప్పటి నుండే మంచి లక్ష్యాలను నిర్దేశించికొని, వాటిని సాధించే విధంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. ఆదివారం ఐఐటీ హైదరాబాద్ – రూరల్ డెవెలప్మెంట్ సెంటర్ అధ్వర్యంలో ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తుకు ఐఐటి హైదరాబాద్, రూరల్ డెవెలప్మెంట్ సెంటర్ అధ్వర్యంలో నిర్వహించిన “ప్రేరణ” ఒక మంచి కార్యక్రమం అని, మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యార్థుల భవిష్యత్తు పై పట్టు సాధించే విధంగా ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే మంచి లక్ష్యాలను నిర్దేశించికొని, వాటిని సాధించే విధంగా కృషి చేయాలని, విజయం ఎవ్వరిని ఊరికే వరించదని, కష్టపడి చదివినప్పుడే విజయ తీరాలను చేరుకోగళం అన్నారు. ప్రస్తుత సమాజంలో పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రానిస్తున్నారని, అన్ని రంగాలలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని, మహిళలు నిర్భయంగా ముందుకు వచ్చి, స్త్రీ శక్తిని చాటాలని పిలునిచ్చారు. ముఖ్యంగా జిల్లాలో మహిళల భద్రతకు జిల్లా పోలీసు శాఖ కట్టుబడి ఉందని, మహిళల రక్షనార్ధమై జిల్లా వ్యాప్తంగా షి-టీమ్ బృందాలను ఏర్పాటు చేసి, మహిళల, బాలల రక్షణకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా పోక్సో, అత్యాచార కేసులలో బాధిత మహిళలకు భరోసానిస్తూ భరోసా సిబ్బంది అన్ని రకాల సేవలను ఒకే చోట అందించడం జరుగుతుందని అన్నారు. ఆన్ లైన్ మోసాలకు సంభందించి చిన్న పిల్లలకు, బాలికలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. సైబర్ మోసాల గురించి జిల్లా సైబర్ వారియర్ సిబ్బంది మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు చిన్న పిల్లలే టార్గెట్ గా చేసుకొని ఆన్లైన్ గేమ్స్ మాటున తప్పుడు లింక్స్ పంపుతూ పిల్లలను గేమ్స్ కు బానిసలయ్యే లా చేస్తూ వివిధ రకాల సైబర్ నేరాలను పాలపడుతున్నారని, తల్లిదండ్రులుగా పిల్లలను, వారి కదలికలను, మరియు వారు ఏ విధమైన గేమ్స్ అడుతున్నారని, ఏఏ సైట్ లను వెతుకుతున్నారని కనిపెట్టాలని అన్నారు. సైబర్ నేరాల గురించి అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా షీ-టీం, భరోసా సిబ్బంది మాట్లాడుతూ.. మహిళలు, బాలికలు మీకు జరిగిన అన్యాయాన్ని గురించి నిర్భయంగా షీ టీంతో చెప్పుకోవాలని, షీ టీం బృందాలు మీ సమస్య తక్షణ పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డా. హిమబిందు, ఎమ్.ఏ.ఈ. విభాగం, డా.శుహిత, ఎల్.ఏ. విభాగం, డా.అర్వింద్, సి.ఎస్.ఈ. విభాగం, డా.ప్రేమ్‌పాల్, ఫిజిక్స్ విభాగం, డా.మయుఖ్ పహారి, ఫిజిక్స్ విభాగం, సతీష్ – రూరల్ డెవెలప్మెంట్ సెంటర్ అసోసియేట్ ప్రొఫెసర్, కంది మండల విద్యాధికారి, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సంగారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతి, షీ-టీం ఎస్ఐ, భరోసా, సైబర్ వారియర్స్ సిబ్బంది మరియు వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విధ్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విద్యార్థులు చిన్నప్పటి నుండే మంచి లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Published On: November 2, 2025 6:04 pm