పోలీసులకు ఇంటి వద్దకే గ్యాస్ సిలిండర్ పంపిణీ సౌకర్యం: గ్యాస్ సిలిండర్ పంపిణీ ఆటోను ప్రారంభించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గ్యాస్ సిలిండర్ పంపిణీ ఆటో ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ప్రజల రక్షణలో నిమగ్నమయ్యే సిబ్బంది వెల్ఫేర్ మా బాధ్యత అని, సిబ్బంది సౌకర్యార్థం గ్యాస్ సిలిండర్‌ను ఆటో ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఎస్పీ అన్నారు. సిలిండర్ అవసరమున్న సిబ్బంది ఆన్‌లైన్ ద్వారా గాని, గ్యాస్ బుకింగ్ నెంబర్ కు మిస్ కాల్ ద్వారా గాని గ్యాస్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ చేసిన తర్వాత, రెండు రోజుల కాల వ్యవధిలో పోలీసు విభాగంచే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ ఆటో (ఎలెక్ట్రిక్) ద్వారా గ్యాస్ సిలిండర్‌ను గృహద్వారం వద్దకు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రత్యేక సౌకర్యం సిబ్బందికి సులభమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సిహెచ్ రఘునందన్ రావు, ఏ.ఆర్ డీఎస్పీ నరేందర్, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, ప్రభాకర్, సైదా నాయక్, ఆర్.ఐ.లు రామారావు, రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now