సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, ఐ.యం.ఏ, జిల్లా పోలీసుల సంక్షేమానికి మరిన్ని హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. గురువారం సమగ్ర ఆరోగ్య శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. నిత్యం ఏదో ఒకరకమైన విధులల్లో నిమగ్నమయ్యే పోలీసులకు సమయానికి భోజనం, విశ్రాంతి లేకపోవడం శారీరక-మానసిక భారం వంటి సమస్యలు సిబ్బంది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయని, ఈ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణ అత్యంత ముఖ్యమని జిల్లా పోలీసు శాఖ, ఐ.యం.ఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ఆధ్వర్యంలో కాంప్రిహెన్సివ్ హెల్త్ క్యాంప్ (సమగ్ర ఆరోగ్య శిబిరం)ను నిర్వహించడం జరిగిందని అన్నారు. జిల్లా పోలీసుల సంక్షేమానికై జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ఈ హెల్త్ క్యాంపు ద్వారా 40 సంవత్సరాల వయసు పైబడిన పోలీసులు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 1155 మంది ఈ సమగ్ర ఆరోగ్య శిబిరం సేవలను వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ క్యాంపు ద్వారా సిబ్బందికి ప్రత్యేక ఫైల్ మెయింటెన్ చేయడం జరుగుతుందని, జిల్లా పోలీసుల సంక్షేమానికై కట్టుబడి ఉన్నామని, మునుముందు కూడా ఇలాంటి హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ.. సిబ్బంది సంక్షేమానికి తోడ్పడటం జరుగుతుందని ఎస్పీ అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల కొరకు శ్రమించే, పోలీసులకు సేవలందించడానికి మెడికల్ డిపార్ట్మెంట్ ముందుంటుందని, పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజానికి పూర్తి స్థాయి సేవలను అందించగలరని, అలాంటి పోలీసుల ఆరోగ్యం రక్షణకు జిల్లా పోలీసు శాఖతో కలిసి మరిన్ని హెల్త్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, డీఎస్పీ సత్యయ్యగౌడ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంగారెడ్డి అధ్యక్షులు కె.కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీ డా.ఆనంద్, ట్రెసరర్ డా.హరినాథ్, డా.రాజుగౌడ్, డా.శ్రీహరి, పోలీస్ డా.జ్యోతి, ఇతర వైద్యులు, అంబేద్కర్ కాలేజ్ నర్సింగ్ విధ్యార్థులు, జిల్లా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసుల సంక్షేమానికి మరిన్ని హెల్త్ క్యాంపులు నిర్వహిస్తాం: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Oplus_16908288