జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి..జిల్లా ఎస్పి యం.రాజేష్ చంద్ర, ఐపిఎస్ 

జిల్లా ప్రజలు హోలీ పండుగను ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలి

– శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు, మద్యం మత్తులో వాహనాలు నడపడం చేయారాదు

– హోలీ పండుగ సందర్బంగా ఫేస్బుక్లో , ఇంస్టాగ్రామ్ లో

మరి ఏ విధమైన సోషల్ మీడియా సైట్లలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదు.

– జిల్లా ఎస్పి యం.రాజేష్ చంద్ర, ఐపిఎస్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

హోలీ పండుగ – 2025 సందర్భంగా ప్రజల శాంతి భద్రతలను పరిరక్షించేందుకు జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ కొన్ని సూచనలతో హోలీ పండుగను సురక్షితంగా జరుపుకోవాలన్నారు.

జిల్లా ప్రజలకు ఎస్పీ తెలిపిన సూచనలు , జాగ్రత్తలు తెలిపారు. 14-03-2025 నా 6:00 గంటల నుండి 12 గంటల వరకు హోలీ పండుగ జరుపుకోవాలి.

సురక్షితమైన రంగులను ఉపయోగించండి – హానికరమైన రసాయనాలున్న రంగులను వాడకండి.

ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని విసరడం కఠినంగా నిషేధించబడిందన్నారు. ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దు, నీటి బెలూన్లు, గాజు పొడి కలిపిన రంగులు వాడరాదు. ఎవరైనా తమ అనుమతి లేకుండా బలవంతంగా రంగులు పూయడం, శారీరక లేదా మానసిక వేధింపులకు గురిచేయడం తీవ్రంగా నేరంగా పరిగణించబడుతుంది. పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇతరులను ఇబ్బంది పెట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యం మత్తులో అల్లర్లు చేయడం నిషేధం. మద్యం సేవించి వాహనం నడపకండి, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం, చట్టవిరుద్ధం.

ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాలను సమూహాలుగా తరలించడం, వీధుల్లో అవాంఛిత రీతిలో తిరగడం అనుమతించబడదు.అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్లకు కాల్ చేయండి, ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. శాంతిభద్రతలకు భంగం కలిగించే, ప్రజలకు అసౌకర్యం లేదా ప్రమాదం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించబడును. ఫేస్బుక్లో గాని, ఇంస్టాగ్రామ్ లో గాని, మరి ఏ విధమైన సోషల్ మీడియా సైట్లలో అసత్య ప్రచార పోస్టులను పోస్ట్ చేసినచో వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోబడును. చెరువులు కుంటలలో లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దు. ప్రార్థనా మందిరాల వద్ద రంగులు చల్లవద్దు అన్నారు. పండుగ వేళ మహిళలను వేదింపులకు గురిచేసిన కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు.

తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నమన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.ప్రజలు హోలీ పండుగను అందరూ ఆనందంగా, సౌహార్దతను కాపాడుతూ, సురక్షితంగా హోలీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment