– కొత్త సంవత్సరం సంబరంలో ఇంటిలో విషాదం నింపద్దు..
– జిల్లా ఎస్పీ సింధు శర్మ
ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 30,కామారెడ్డి
2023 సంవత్సరంలో కంటే 2024 సంవత్సరంలో నేరాలు, హత్యలు పెరిగాయి, రోడ్డు ప్రమాదంలో గాయపడినవి తక్కువ అయిన మరణాలు ఎక్కువగానే జరిగినట్లు సోమవారం జిల్లా ఎస్పీ సింధు శర్మ విలేకరుల సమావేశంలో ప్రవేశపెట్టిన సంవత్సర రిపోర్టులో దాంట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. సోమవారం జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింధు శర్మ మాట్లాడుతూ 2023లో సంవత్సరం 5578 నేరాల జరుగదా 2024 లో 6006 నేరాలు జరిగాయని, ఇందులో 708 ఆస్తికి సంబంధించిన నేరాలు, 38 హత్యలు, 35 కిడ్నాప్లు, 60 రేప్ కేసులు, 513 రోడ్డు ప్రమాద కేసులు, 1441 ఇతరాత్ర కేసులు, 561 స్పెషల్ లోకల్ చట్టాల కేసులు, 535 మిస్సింగ్ కేసులు ఉన్నాయన్నారు. 2023 లో 28 హత్య కేసులు, 2024 లో 37 హత్య కేసులు జరిగాయి, ఈ సంవత్సరము జరిగిన 37 హత్యలలో 10 కుటుంబ తగాదాలు,
6 వివాహేతర సంబందాలు, 4 ఆస్తి తగాదాలు, (2) భూతగాదాలు, (2) పాత కక్షలు, (1) ప్రేమ వ్యవహారం
(1) అకస్మాత్తు సంఘటన వలన జరిగినవి. 35 హత్యకేసులలో నేరస్తులను గుర్తించి అరెస్ట్ చేయడం జరిగినదని, అదేవిధముగా నేరస్తులకు తొందరలోనే శిక్షపడే విధముగా అన్ని రకముల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆస్తి సంబందిత నేరాలలో 65 శాతం కేసులను భేదించి నెరస్తులను ఆరెస్ట్ చేసి 53 శాతం సొత్తు ఇప్పటికె స్వాదీనం చేసుకొని బాధితులకు
అందించడం జరిగిందన్నారు. నేరస్థుల అందరిపై తగిన ఆధారాలతో కోర్ట్ యందు దార్డ్ షీట్ వేసి వారికి శిక్ష పడేలా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళా సంబంధిత నేరాలు 2023 లో 361 కేసులు కాగా, 2024 లో 517 కేసులు జరిగాయన్నారు. ఇందులో (12) హత్యలు, (2) వరకట్న మరణాలు, (61) రేప్ కేసులు, (3) గృహ హింస వలన ఆత్మహత్యలు, (304) గృహ హింస కేసులు జరిగాయి, 103 లైంగిక వేదింపులు, (25) కిడ్నాప్ కేసులు నమోదయ్యాయన్నారు. వీరందరికీ
డీఎస్పీ కార్యాలయాల యందు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగి సమస్యలు పరిష్కరించే విధముగా ప్రయత్నిస్తున్నాము అన్నారు. ఈ సంవత్సరములో 712 అవగాహణ యెందు చేసిన షి టీమ్స్ ప్రతి సబ్ డివిజన్ నందు చురుకుగా పనిచేస్తూ వెంటనే స్పందిస్తున్నాయి. 2094 హాట్ స్పాట్ లను సందర్శించడం జరిగిందన్నారు. 72 కేసులు చేయడం జరిగినది. స్కూల్ లలో అవగాహణ కార్యక్రమాల వలన నాగిరెడ్డపేట్, లింగంపేట్, భిక్నూర్, గాంధారి, నిజాంసాగర్, నస్రుల్లాబాద్ పాఠశాలల్లోని కొందరి ఉపాద్యాయులపై కేసులు చేయడం జరిగినవన్నారు.
రోడ్డు ప్రమాద కేసులు,2023 లో 230 మరణాలు, 2024 లో 258 మరణాలు, రోడ్డు ప్రమాదాలలో గాయపడినవి 2023 లో 271,2024 లో 255 జరిగయన్నారు. వీటిని తగ్గించేందుకు 205 ఏఆర్టీ యొక్క రిపోర్ట్ ల ప్రకారం తగిన చర్యలు తీసుకోవడం
జరుగుతుందన్నారు.తరచూ ప్రమాదాలు జరిగే చోట వేగ పరిమితి తగ్గించుట కొరకు సూచిక బోర్డులను, రంబూల్ స్టేప్ లు ఏర్పాటు చేయడం ఒరిగినది. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సైబర్ నేరాలు గతంలో కంటే సంవత్సరం తగ్గాయన్నారు. ప్రతి నెల మొదటి బుదవారము నా జిల్లా లోని అన్ని పోలీసు స్టేషన్ ల యందు సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం లోక్ అదాలత్ ద్వారా మన జిల్లాలో సైటర్ నేరస్థుల మాసలకు గురి అయిన 279 మంది బాదితుల యొక్క వేల కట్టలేని విలువైన రూ.33,14,895,64/- బాదితులు తిరిగి పొందే విధముగా కోర్ట్ ద్వారా వివిద బ్యాంక్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. టెక్నాలజీ ఉపయోగించి సుమారు 500 కేసులను చేదించడం జరిగిందన్నారు. ఇందులో సీసీ కెమెరాల వలన సుమారు. (100) కేసులను చేదించడం జరిగింది. తద్వారా ప్రజల విలువైన డబ్బు, ఆదరణాలను రకవరీ చేయడము జరిగినదన్నారు. అదేవిదముగా ఇవి నేరస్తులను పట్టుకొని కోర్టులలో నిల్పడంలో ఎంతగానే ఉపయోగపడుతున్నాయన్నారు. మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైన్ ద్వారా 58,798 అనుమానితులను చిక్ చేయగా 293 మంది నేరస్తులను గుర్తించడం జరిగిందన్నారు. సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ద్వారా ఈ సంవత్సరము 1388 దొంగిలించబడిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ లను గుర్తించి తిరిగి బాధితులకు అందచేయడం జరిగినది. వాటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయల పైబడి ఉంటుంది. రాష్ట్రం లోని పోలీస్ కమీషనర్ కార్యాలయ పరిధిలో కాకుండా జిల్లాల వరుసలో మన జిల్లా ప్రధమ స్థానములో నిలుస్తూ వస్తుందన్నారు. 100 డయల్ కు ఈ సంవత్సరములో మొత్తం 43033 కాల్స్ రాగా, వీటిలో 193 కేసులు నమోదు చేయగా మిగితావి వివిధ విధాలుగా అటెండ్ చేయడం జరిగినది. ఆదవిదముగా నుండి సమాచారం అందిన వెంటనే అతి తక్కువ సమయములోనే బాధితుల వద్దకు బ్ల్యూకో, పెట్రోలింగ్ సిబ్బంది చేరుకునని ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాము. ఆపరేషన్ స్మైల్, ముస్ఖాన్ కార్యక్రమంలో ఈ సంవత్సరము జనవరి, జూలై నెల ఒకటవ తేదీ నుండి 31 తేది వరకు 18 సం. లోపు బాల కార్మికులుగా పనిచేస్తున్న (84) మందిని గుర్తించి వారి తల్లి తండ్రులకు అప్పాగించి వారిని బడిలో చేర్పించడం జరిగింది. 7 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడానికి 51 ప్రభుత్వ పాఠశాలలోని 122 మంది విద్యార్థులులను పిలెక్ట్ చేసి రోడ్ సష్టి ఎంపిక చేసి అవగాహణ, ఒకరోజు శిక్షణ ఏర్పాటు చేయడం ఒరిగిందన్నారు. ఆదేవిదముగా హెల్మెట్ తప్పనిసరీ అనీ, రాంగ్ రూట్, వాహనముల వేగ పరిమితికి మించి వెల్ల రాదు అని అవగాహణ కార్యక్రమాల ద్వారా తెలియపరచడం జరిగిందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ కంపెంట్స్ సెల్ నెంబర్ -8712686142. 2025- సంవత్సరము రానున్న సంవత్సరములో నేరాలు తగ్గి విధముగా మరియు ప్రచందరికీ పూర్తి భద్రతతో కూడిన సమాజాన్ని అందించే విధముగా అవసరమగు అన్ని చర్యలు తీసుకుంటాము అన్నారు. ముందుజాగ్రతలను ప్రజలకు ఏప్పటికప్పుడు మీడియా, సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియచేయడం జరుగుతుందన్నారు.