జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS ఆదేశాలతో రైళ్లలో తనిఖీలు
ఒడిస్సా నుండీ బెంగుళూరుకు అక్రమంగా తీసికెళ్తున్న 219 గంజాయి చాక్లెట్లు పట్టివేత… ఒకరి అరెస్టు
ఈ తనిఖీలలో పాల్గొన్న అనంతపురం త్రీటౌన్ పోలీసులు, ఈగల్ సెల్, జీఆర్పీ మరియు రైల్వే పోలీసులు
జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు అనంతపురం జిల్లాలో ప్రత్యేక గంజాయి చెకింగ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఈగల్ సెల్, అనంతపురం 3 టౌన్ పోలీస్, GRP (Government Railway Police), మరియు రైల్వే పోలీస్ బృందాలు సంయుక్తంగా పాల్గొన్నాయి.
ఈ తనిఖీలు అనంతపురం నుండి ధర్మవరం వెళ్ళే 18463 నెంబర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (ఆరంభ సమయం ఉదయం 6:20 గంటలకి) లో చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఒడిషాకు చెందిన సాల్మన్ అనే ప్రయాణికుడి వద్ద గంజాయి పదార్థం కలిగిన 219 చాక్లెట్లు పట్టుకున్నారు.
పట్టుబడిన వ్యక్తి మరియు గంజాయి పదార్థం కలిగిన చాక్లెట్లు రైల్వే పోలీసులకు అప్పగించబడినవి. ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు జరుపుతున్నారు.
గంజాయి వంటివి మానసిక ఆరోగ్యానికి హానికరమైనవిగా ఉండటంతో, వాటి వినియోగాన్ని, రవాణాను నిరోధించేందుకు ఈగిల్ సెల్ నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ప్రజలు కూడా ఇలాంటి నేరాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగలరు.
Andhra Pradesh Police .