Site icon PRASHNA AYUDHAM

సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ను మరియు సర్కిల్ ఆఫీస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ 

IMG 20250711 WA0364

సదాశివ నగర్ పోలీస్ స్టేషన్ను మరియు సర్కిల్ ఆఫీస్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

 

 

— యం.రాజేష్ చంద్ర ఐపీఎస్

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 11

 

 

• *ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి*.

• *విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి.*

• *డయల్ -100 కాల్స్ కు బ్లూ కోల్ట్స్ సిబ్బంది వెంటనే స్పందించాలి.*

• *సైబర్ క్రైమ్ పై ప్రజల్లో అవగాహన పెంచాలి.*

సదాశివనగర్ పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్* ను ఆకస్మికoగా సందర్శించి, స్టేషన్ రికార్డ్స్ ను, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను స్టేషన్ పరిసరాలను పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ లోని పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే డయల్ – 100 కాల్స్ కు వెంటనే స్పందించాలని మరియు పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS సదాశివనగర్ ఎస్సై కి సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకవచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రాపర్ గా బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. విసృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి అన్నారు. సిబ్బంది వారికి కేటాయించిన గ్రామలకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించాలి అదేవిధముగా తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పై, మూడ నమ్మకాలు, బాల్య వివాహాల పై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పి సూచించడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో సదశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, సదశివనగర్ ఎస్ హెచ్ ఓ పుష్పరాజ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు

Exit mobile version