Site icon PRASHNA AYUDHAM

డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందించాలి..- జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర 

IMG 20250516 205159

శాంతి భద్రతల పరిరక్షణలో డయల్ – 100 సేవలు కీలకం

– డయల్ 100 కాల్స్ పట్ల తక్షణమే స్పందించాలి.

– సంఘటన స్థలాలకు వీలైనంత త్వరగా చేరుకోవాలి.

– బాధితుల సమస్యలను పరిష్కరించే దిశగా విచారణ చేపట్టాలి.

– జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

శాంతి భద్రతల పరిరక్షణలో డయల్ – 100 సేవలు కీలకం అని జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్లో డయల్ 100 సేవల నిర్వహణ పై బ్లూ కోట్స్, పెట్రో కార్స్ పోలీసు సిబంధితో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశం లో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పాల్గొని సిబ్బందికి డయల్ 100 కాల్స్ వచ్చినప్పుడు ఏమైనా సమస్యలు వస్తున్నాయా, ఏలాంటి కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. డయల్100 కాల్స్ వచ్చినప్పుడు సంబంధిత స్థలానికి త్వరగా చేరుకోవాలని ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. శాంతి భద్రతలు పరిరక్షించడంలో బ్లూ కోట్స్, పెట్రో కార్స్ సిబ్బంది సేవలు ఎంతో కీలకం అని ఎస్పీ తెలిపారు. డయల్ 100 కాల్స్ వచ్చినపుడు పోలీసు సిబ్బంది వీలైనంత త్వరగా స్పందించి సంఘటన స్థలాన్ని చేరుకోవడం ద్వారా నేరం యొక్క తీవ్రతను వీలైనంతవరకు తగ్గించవచ్చని తెలియజేశారు. ముఖ్యంగా డయల్ 100 కాల్ వచ్చినప్పటినుండి త్వరగా సంఘటన స్థలాలకు చేరుకునేంతవరకు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్ హెచ్ ఓ కి సమాచారం ఇవ్వాలని సూచించారు. సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత బాధితులకు న్యాయం చేకూరే విధంగా విచారణ చేపట్టాలని, సమస్య పెద్దదైతే ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. జన సామర్థ్యం గల ప్రదేశాలలో విసిబుల్ పోలీసింగ్ ఉండాలని, విధుల్లో ఉన్నవారు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ పాయింట్ బుక్స్ విధిగా తనిఖీ చేయాలని, రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ లను ప్రతిరోజు తనిఖీ నిర్వహించాలని సూచించారు. డయల్ 100 కు వినియోగించే టాబ్ లాను జాగ్రత్తగా వినియోగించి 24 గంటలు నెట్వర్క్ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి అని తెలిపారు. సిబ్బందికి ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలున్న నేరుగా సంప్రదించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద సీఐ నరేష్, డయల్ 100 పెట్రో కార్స్, బ్లూ కోర్ట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Exit mobile version