Site icon PRASHNA AYUDHAM

నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం

IMG 20250807 WA0031

నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, ప్రశ్న ఆయుధం ఆగస్టు 7

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అధ్యక్షతన జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసే మార్గాలు చర్చించబడాయి.

ఆగస్టు 11న అల్బెండజోల్ మాత్రల పంపిణీ:

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సి. ఉమా గౌరి మాట్లాడుతూ, పిల్లల్లో కనిపించే పేగు పురుగుల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయనీ, వాటిని నివారించేందుకు ఈ కార్యక్రమం ఎంతో అవసరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 11, 2025న అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. దినోత్సవానికి అనంతరం మిగిలిపోయిన పిల్లల కోసం ఆగస్టు 18న మాప్-అప్ డే నిర్వహించనున్నారు.

శాఖల సమన్వయంతో అమలు:

అదనపు కలెక్టర్ రాధికా గుప్తా మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలందరికీ ఈ మందులు అందేలా చూడాలని ఆరోగ్య, విద్య, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. మాప్-అప్ డే ద్వారా మందులు మిగిలిపోయిన పిల్లలకు కూడా అందించాలన్నారు.

గరిష్ట కవరేజీ లక్ష్యం:

ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి పిల్లవాడికి మందు అందించడం, గరిష్ట కవరేజీ సాధించడం టాస్క్‌ఫోర్స్ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ప్రజల్లో అవగాహన పెంచడంపై దృష్టి సారించాలని, నిఘా బలోపేతం, ఆరోగ్య సమాచారాన్ని సమర్థవంతంగా సేకరించి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని డా. ఉమా గౌరి సూచించారు.

Exit mobile version