ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటో పెట్టాలన్న జిల్లా ఉపాధ్యక్షుడు గిరెడ్డి మహేందర్ రెడ్డి

సీఎం చిత్రపటాన్ని ప్రతి కార్యాలయంలో ఏర్పాటు చేయాలి గిరిడ్డి మహేందర్ రెడ్డి..

IMG 20240723 WA0078

ప్రతి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చిత్రపటం పెట్టాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా మాట్లాడుతూ ఒక వారం రోజు టైం ఇస్తున్నామని  ఒకవేళ పెట్టని యెడల జిల్లా కలెక్టర్  వద్దనే మాట్లాడదామని తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ప్రతి ఆఫీస్ లో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు మాటలను జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వ అధికారులు ఇలానే చేశారా అని ప్రశ్నించారు.. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం చిత్రపటాన్ని పెడతారా లేదా అన్నది వారం రోజులపాటు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది..

Join WhatsApp

Join Now