ఈనెల 20న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ కార్యక్రమం: జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఈ నెల 20న సంగారెడ్డి బాలసదానంలో సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య, సీడబ్ల్యూసీ కమిటీ సభ్యులు డా. చక్రపాణి పాల్గొననున్నారని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం తరఫున సంగారెడ్డి, నారాయణఖేడ్ చిల్డ్రెన్ హోమ్స్‌లో ఈ నెల 14 నుంచి 19 వరకు బాలసధనం వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. నవంబరు 20న ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ప్రత్యేక కార్యక్రమాలు చేపపడుతున్నట్లు లలితకుమారి తెలిపారు.

Join WhatsApp

Join Now