Site icon PRASHNA AYUDHAM

జిల్లా వెట్లాండ్స్ గుర్తింపు, రక్షణ చర్యలకు వేగం జిల్లా కలెక్టర్

IMG 20251204 WA0292

జిల్లా వెట్లాండ్స్ గుర్తింపు, రక్షణ చర్యలకు వేగం

 

– కలెక్టర్ ఆధ్వర్యంలో కీలక సమీక్ష

 

 

 

ప్రశ్న ఆయుధం

 

కామారెడ్డి జిల్లా డిసెంబర్ 04

 

జిల్లాలో చిత్తడి నేలలు (Wetlands) గుర్తింపు, భూసర్వే, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం వంటి కీలక అంశాలపై గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్‌ డిపార్ట్‌మెంట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి నిఖితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

వెట్లాండ్ల గుర్తింపు కోసం జిల్లాలోని సహజ, కృత్రిమ చెరువులు, కుంటలు, జలాశయాలను చిత్తడి నేలల ప్రమాణాల ప్రకారం గుర్తించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

 

రెవెన్యూ, అరణ్య, నీటిపారుదల, ఫిషరీస్ శాఖల సంయుక్త బృందం ద్వారా ఫీల్డ్ వెరిఫికేషన్‌ను త్వరితగతిన ఫీల్డ్ సర్వే పూర్తి చేయాలని నిర్ణయించారు.

 

డేటా సమీకరణ – GIS మ్యాపింగ్:

ప్రతి వెట్లాండ్‌కు సంబంధించిన సరిహద్దులు, FTL, భూమి రికార్డులు, జీవవైవిధ్యం, నీటి ప్రవాహ మార్గాల వివరాలను సేకరించి GIS మ్యాపింగ్ చేయాలని అధికారులు తెలిపారు.

సర్వే నివేదికల ఆధారంగా జిల్లా స్థాయిలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు.

 

రక్షణ చర్యలో భాగంగా వెట్లాండ్ ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలు, చెత్త పారవేయడం, కాలువ మూసివేత, సిల్టింగ్, వ్యర్థజలాల ప్రవాహం వంటి చర్యలను పూర్తిగా నిషేధించాలని తీర్మానించారు.

 

అన్ని శాఖలు పారదర్శకంగా, సమయపాలనతో డేటా అందించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిత్తడి నేలలు పర్యావరణ సమతుల్యతకు అత్యంత కీలకం. వాటి సంరక్షణ ప్రతి శాఖ బాధ్యత. వెట్లాండ్లను శాస్త్రీయంగా డాక్యుమెంట్ చేయడం అత్యవసరం” అని కలెక్టర్ పేర్కొన్నారు.

 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, FDO రామకృష్ణ, సునీత, అటవీ క్షేత్ర అధికారులు రమేష్, హబీబుద్దీన్, ఇరిగేషన్, ఫిషరీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version