జిల్లాల వారీగా వర్గీకరణ…జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలి..1

జిల్లాల
Headlines
  1. మాదిగలు: జిల్లాల వారీగా వర్గీకరణపై పోరాటం
  2. పిడమర్తి రవి: మాదిగలకు అన్యాయం కాదని స్పష్టం
  3. ప్రభుత్వానికి విజ్ఞప్తి: సరైన దృక్పథం అవసరం
  4. అంబేడ్కర్ విగ్రహానికి నివాళి: ర్యాలీ ఘనత
  5. 12% రిజర్వేషన్: మాదిగ పోరాటానికి కొనసాగింపు

మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి…

రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ పై ముందుకు పోవడం హర్షించదగ్గ పరిణామం అని 30 ఏండ్ల మాదిగల సుదీర్ఘ నిరీక్షణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేయడం ద్వారా తెరదించ బోతున్నాడని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్బంగా భద్రాచలం లోని బ్రిడ్జి సెంటర్ నుండి వందలాది మందితో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాులర్పించారు అనంతరం ర్యాలీని ఉద్దేశించి పిడమర్తి రవి మాట్లాడుతూ…రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పట్ల సరైన దృక్పథం లేక కొందరు రాష్ట్రాన్ని యూనిట్ గా చూస్తున్నారని రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టే సందర్భాల్లో మాదిగలు గణనీయంగా నష్టపోయే అవకాశం ఉందని అందుకు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను జిల్లాల వారీగా వర్గీకరణ చేపట్టే అంశాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాదిగల పక్షాన నిలబడ్డ ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధిని చాటుకుంటున్న ప్రభుత్వం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ బిడ్డలకు అన్యాయం జరగకుండా జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. శనివారం గడ్డం శ్రీరామ్ అధ్యక్షతన భద్రాచలంలోని అంబేడ్కర్ సెంటర్లో జరిగిన మాదిగ సమ్మేళనం లో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ మాదిగలు అంటరాని వారిగా తిరో గమనంలో బ్రతకడానికి కారణమైన హిందూ మత వాద బిజెపి పార్టీకి మాదిగలు ఇప్పటికీ దగ్గర కారని అన్నారు. మాదిగలకు 12% రిజర్వేషన్ అందేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొడారి ధీరన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండమీది గోవిందరావు,మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గద్దల నాగేశ్వరరావు,ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మట్టే గురు మూర్తి, నాయకులు బెజవాడ శ్రవణ్, మాదిగ యూత్ చేసి రాష్ట్ర అధ్యక్షులు, నక్క మహేష్, దేవరకొండ నరేష్, ఆవులూరి సత్యనారాయణ, నక్క శాంత కుమార్, చింత నాగ ముత్యం, నక్క రత్నకుమారి, మల్లీశ్వరి, గడ్డం చిట్టెమ్మ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు…

Join WhatsApp

Join Now