దివ్య దర్శనం పునః ప్రారంభం..

దివ్య దర్శనం పునః ప్రారంభించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించిన తిరుమల ఈవో..

IMG 20240824 WA0039

తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం, ఎస్ఎస్ డి టోకెన్ల జారీ కేంద్రాన్ని శనివారం టిటిడి ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు.అలిపిరి వద్ద భక్తులకు ఇదివరకు జారీ చేస్తున్న దివ్యదర్శనం టోకెన్లను పునః ప్రారంభించేందుకు సాధ్యసాధ్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎస్ఎస్ డి టోకెన్ల జారీ ప్రక్రియను, క్యూ లైన్లను, ఎస్విబిసి మాస్టర్ కంట్రోల్ రూమ్ ను, ఎస్విబిసి పాత పరిపాలన భవనాన్ని పరిశీలించారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా టోకెన్లు జారీ చేయడానికి శాశ్వత క్యూలైన్లు, ఇతర అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తరువాత అలిపిరి పాదాల మండపం వద్ద ఇదివరకు దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని, టిటిడి జలప్రసాదాన్ని, లగేజీ కౌంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.ఈవో వెంట జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్వో శ్రీ శ్రీధర్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సిఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.

 

Join WhatsApp

Join Now