Site icon PRASHNA AYUDHAM

దీపావళి రాత్రి వృద్ధురాలి హత్య.. ఆభరణాల కోసం చంపిన మోసగాడు

IMG 20251022 WA0425

దీపావళి రాత్రి వృద్ధురాలి హత్య.. ఆభరణాల కోసం చంపిన మోసగాడు

 

నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలింపు

పేకాట, జల్సాలకే ఈ దారుణానికి కారణం

 

కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం)అక్టోబర్ 22

 

 

దీపావళి పండుగ రాత్రి నసురుల్లాబాద్ మండలంలోని అంకోల్ తండాలో చోటుచేసుకున్న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు తక్కువ సమయంలో ఛేదించారు. ఆభరణాల కోసం 67 ఏళ్ల వృద్ధురాలిని చంపిన నిందితుడు **మెగవత్ సవాయి సింగ్ (40)**ను పోలీసులు పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.

దారుణం ఇలా జరిగింది.

తేదీ 20 అక్టోబర్ సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో అంకోల్ తండాకు చెందిన గుగులోత్ రాధిబాయి (67) ఇంట్లో ఒంటరిగా ఉండగా అదే గ్రామానికి చెందిన మెగవత్ సవాయి సింగ్ ఆమె ఇంట్లోకి వెళ్లాడు. పేకాటలో డబ్బులు పోయిన నిందితుడు ఏదైనా దొంగతనం చేయాలని ముందే నిర్ణయించుకున్నాడు. వృద్ధురాలు దీపావళి పూజలు ముగించుకొని ఇంట్లో ఉన్న వేళ “ఆశీర్వాదం తీసుకోవాలి” అంటూ ఇంట్లోకి వెళ్లి, ఆమెతో మాట్లాడుతూ తలుపులు లోపల నుంచి వేసుకున్నాడు.

తర్వాత అక్కడే ఉన్న గొడ్డలితో రాధిబాయిపై వెనుక నుండి దాడి చేసి తలపై, కళ్లపై బలంగా కొట్టి, గొంతు పిసికి హత్య చేశాడు. అనంతరం ఆమె చేతులలో ఉన్న రెండు వెండి రెట్ట కడియాలు (30 తులాలు) లాక్కొని పారిపోయాడు.

సాక్షులు గమనించడంతో ముఠా కదిలింది.

 

పక్కింటి మహిళ లక్ష్మీబాయి ఈ దృశ్యాన్ని గమనించి అడ్డుకోవడంతో ఆమెను నిందితుడు కడుపులో తన్ని అక్కడి నుండి తప్పించుకున్నాడు. మృతురాలి కుమారుడు గుగులోత్ లాల్‌సింగ్, ఫిర్యాదు మేరకు నసురుల్లాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నం. 126/2025 U/Sec 103(1), 305(a), 115(2), 351(2) BNS నమోదు చేశారు.

 

అరెస్టు వివరాలు;

 

పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని బాన్సువాడలో వెండి కడియాలు అమ్మే ప్రయత్నంలో పట్టుకున్నారు.

సవాయి సింగ్ గతంలో కూడా దొంగతనాల్లో పాల్పడిన వ్యక్తి. 2021లో బాన్సువాడ టీచర్స్ కాలనీలోని బ్యాంక్‌లో కంప్యూటర్ దొంగిలించిన కేసులో అరెస్టై జైలుకు వెళ్లాడు. అతనిపై సస్పెక్ట్ షీట్ కూడా ఉంది.

 

ఎస్పీ అభినందనలు;

 

ఈ కేసును తక్కువ కాలంలో ఛేదించినందుకు డి‌ఎస్‌పీ బాన్సువాడ విట్టల్ రెడ్డి, సీఐ బాన్సువాడ రూరల్ తిరుపయ్య, ఎస్‌ఐ నసురుల్లాబాద్ పి. రాఘవేంద్ర మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్, అభినందించారు.

 

పేకాట వ్యసనమే నేరాలకు దారితీస్తుంది.

 

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్, మాట్లాడుతూ –

“పేకాట, తాగుడు అలవాట్ల వల్ల కొందరు వ్యక్తులు ఏ పని చేయకుండా డబ్బుల కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఎవరికైనా పేకాట లేదా చట్టవిరుద్ధ కార్యక్రమాల గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712686133కి తెలియజేయండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి” అని తెలిపారు.

Exit mobile version