ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలి – జిల్లా కలెక్టర్ జితేష్.వి. పాటిల్.

ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలి – జిల్లా కలెక్టర్ జితేష్.వి. పాటిల్.

ప్రశ్న ఆయుధం న్యూస్ అక్టోబర్ 19 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

ప్రజల జీవితాల్లో దీపావళి పండుగ కోటి కాంతులు నింపాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

పండుగను కుటుంబ సభ్యులతో సంతోషభరితంగా, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని సూచించారు. టపాసులు కాల్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా చిన్నపిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని ఆయన సూచించారు. సురక్షితమైన పద్ధతుల్లో పండుగను జరుపుకోవడంతోపాటు ప్రమాదాలను నివారించుకోవాలని, పర్యావరణానికి హాని కలిగించే టపాసులు ఉపయోగించకుండా హరితదీపావళి జరుపుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now