Headlines :
-
“దీపావళి పండుగలో బుద్ధుడి జ్ఞానానికి ప్రతీక”
-
“కాంతి మరియు జ్ఞానంతో మనసు నింపే దీపావళి శుభాకాంక్షలు”
దీపావళి అనేది చాంద్రమాన మాసం కార్తీక మాసంలో జరుపుకునే దీపాల పండుగ.
దీపం అంటే జ్ఞానానికి సంకేతం. ప్రపంచానికి జ్ఞానాన్ని వెదజల్లిన బుద్ధుడి రాకకు సంకేతమే దీపదానోత్సవం!
సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత, తన నగరమైన కపిలవస్తుపురానికి వెళ్ళలేదు.
తండ్రి శుద్ధోధనుడు బుద్ధుణ్ణి ఒప్పించి తీసుకురావల్సిందిగా కొంతమందిని పంపాడు.
వారు బుద్ధుడిని అన్వేషిస్తూ వెళ్ళారు.
కానీ, అతడి ప్రభావానికి లోనై…ఆయనతో పాటే ఉండిపోయారు.
తండ్రి శుద్ధోధనుడు మనుషుల్ని పంపుతూ ఉన్నాడు.
కానీ, వెళ్ళినవారు వెళ్ళినట్టు బుద్ధుడి దగ్గరే బౌద్ధభిక్కులుగా ఉండిపోతున్నారు.
అలా పదిహేడు సంవత్సరాలు గడిచిపోయ్యాయి.
చివరకు బుద్ధుడు తన నాలుగు నెలల వర్షావాస తపస్సును ముగించుకొని ధర్మ ప్రచారం కొరకు కపిలవస్తు నగరానికి బయలు దేరాడు.
ఆయన వస్తున్నాడని తెలిసి స్వాగతం పలకడానికి పురప్రజలు సంసిద్ధులయ్యారు.
అప్పటికి వర్షాకాలం అయిపోయింది.
వరదలకు కొట్టుకొచ్చిన చెత్తాచదారం వీధుల్లో ఉంది. వర్షాలకు నాని ఇళ్ళు నిమ్ముగా అయ్యాయి. ప్రజలు వీధులు శుభ్రం చేసుకుని, ఇళ్ళు శుభ్రం చేసుకుని, గోడలకు వెల్ల వేసుకుని, గుమ్మాలకు పూలమాలలు వేలాడేసుకుని సర్వాంగ సుందరంగా అలంకరించుకున్నారు.
ఆ రోజు అమావాస్య గనక, నగరమంతా దేదీప్యమానంగా దీపాలు వెలిగించారు.
ఉన్నవారు లేనివారికి మంచి ఆహారం అందించారు, దీపాలు దానం చేశారు. దీపాలతో వారికి స్వాగతం పలికేరు.
జ్ఞానవంతుడై ప్రపంచానికి జ్ఞానాన్ని వెదజల్లిన బుద్ధుడి రాకకు సంకేతమే దీపదానోత్సవం.
బుద్ధుడు, బౌద్ధభిక్కులు, బుుషులు తమ నాలుగు నెలల వర్షావాస తపస్సును ముగించుకొని ధర్మ ప్రచారం కొరకు 8 నెలల ప్రజల్లోకి వచ్చేటపుడు ప్రజలందరూ దీపాలతో వారికి స్వాగతం పలికే సందర్భమే ఈ దీపావళి, ఇదే నిజమైన దీపావళి.
“చీకటిపై కాంతి విజయం, చెడుపై మంచి మరియు అజ్ఞానంపై జ్ఞానం యొక్క విజయానికి” ప్రతీక.
తేలికైన మనస్సు శ్రేయస్సును కలిగిస్తుంది.
చురుకైన అంతర్గత ఆధ్యాత్మిక చెవులు ఉన్నవారు “ఓ ప్రకృతి బిడ్డలారా ఏకం కండి మరియు అందరినీ ప్రేమించండి” అనే ఋషుల స్వరాన్ని స్పష్టంగా వింటారు.
దీపావళి సందర్భంగా ఇతరులు చేసిన తప్పులను మరచిపొండి మరియు క్షమించండి. అందువల్ల, ప్రతిచోటా స్వేచ్ఛ, పండుగ మరియు స్నేహపూర్వక వాతావరణం ఉంటాయి.
మరి ఏది స్థిరంగా ఉంటుంది అంటే
జీవితాన్ని ఒక వేడుకలా గడపటం, దాని వల్ల కలిగే ఆనందం మరియు మంచితనం అనే భావం .ఇది సరైన “శీలము” తో మాత్రమే సాధ్యమవుతుంది.దీపావళి శుభాకాంక్షలు”