ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నదిని పరిశీలించిన డిఎల్పిఓ
ప్రశ్న ఆయుధం 29 ఆగస్ట్ ( బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ మండలంలోని తాడ్కోలు పరిధిలో గల మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల స్థానికులు ఆసక్తిగా చూసేందుకు తరలి వస్తున్నారు.ఈ నేపథ్యంలో బాన్సువాడ డిఎల్పిఓ సత్యనారాయణరెడ్డి మంజీరా నదిని సిబ్బంది తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఆయనతోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రశాంతి సిబ్బంది తదితరులు ఉన్నారు.