వరద బాధితులకు డిఎంహెచ్ఓ 25000 సాయం

విజయవాడ వరద బాధితులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీహరి తన వంతు సాయంగా రూ.25 వేలు చెక్కును మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదలకు విజయవాడ ప్రజలు అన్ని విధాల నష్టపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు.తీవ్రంగా నష్టపోయిన విజయవాడ ప్రజలకు నా వంతు సహాయంగా నా జీతం నుంచి రూ.25వేల రూపాయలు అందించడం జరిగిందన్నారు.ఈ మేరకు కలెక్టర్ కు చెక్కును అందజేయడం జరిగిందని డాక్టర్ శ్రీహరి తెలిపారు.
Post Views: 8