పరీక్ష తప్పినా అధైర్య పడొద్దు నిరాశ చెందొద్దు.
డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 22: కూకట్‌పల్లి ప్రతినిధి
నేడు ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపిన డి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు.పరీక్షల్లో ఫేయిల్ అయిన విద్యార్థులెవరూ అదైర్యపడొద్దని నిరాశకు లోనై క్షణికావేశంలో ఎటువంటి తప్పుడునిర్ణయాలు తీసుకొవద్దని ఆయన పేర్కొన్నారు పరీక్ష తప్పినంత మాత్రాన జీవితం కోల్పోయినట్టు కాదని కొత్త అవకాశాలను సృష్టించుకుని పట్టుదలతో ముందుకు సాగాలని మరియు తల్లిదండ్రులు వారి పిల్లలకు మనోదైర్యాన్ని ఇవ్వాలని పర్స శ్యామ్ రావు కోరడం జరిగింది.
దేశభవిషత్ నిర్మాణంలో విద్యార్థులు యువతదే కీలక పాత్ర అని చిన్న చిన్న కారణాలతో వారు జీవితాన్ని చాలించి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలించడం చాలా భాధాకరమని పర్స శ్యామ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఫెయిలైనా జీవితంలో విజయం సాధించిన వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పర్స శ్యామ్ రావు పేర్కొన్నారు.