*రైతు దళారుల నమ్మి మోసపోవద్దు*
*వరి ధాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర పొందాలి*
*వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గెటి సదానందం*
*జమ్మికుంట ఏప్రిల్ 23 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజున జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆరు కాలం పండించిన పంటలను దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో మంచిగా ఆరబెట్టి తెలంగాణ ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను పొందాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 15 నెలల వ్యవధిలోనే రైతు సోదరులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ల ఆధ్వర్యంలో ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన మరుసటి రోజు నుండి కొత్త లోన్లు ఇవ్వడం జరిగిందన్నారు.సన్న వడ్లకు క్వింటాలకు రూ500 బోనస్ ఉచిత విద్యుత్ తో పాటు ఏకకాలంలో ఎరువులు సబ్సిడీ పరదాలు అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు సోదరులకు ఏమన్నా ఇబ్బందులు బార్ధాను లారీల సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ల సహకారంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరా క్రాంతి పథకం ఐకెపి ఎపిఎం శ్రీనివాస్ సి సి మ్యాకమల్ల రాజమౌళి కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల ప్రధాన కార్యదర్శి మ్యాకమల్ల అశోక్ యువజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి చెన్నవేన రమేష్ కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు మంగ అశోక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎగ్గెటి కుమారస్వామి తొర్నె సంతోష్ మర్రి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ నాయకులు రామిడి సూర్యతేజారెడ్డి మడిపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షులు తంగేళ్ల పరుశురాములు సీఏలు బొనగాని ప్రియాంక పరమేశ్వరి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.