నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు. మద్యం సేవించి వాహనం నడిపితే కట్టిన చర్యలు. శాంతి భద్రతలకు భంగం కలిగించోద్దు. -జిల్లా ఇన్చార్జి సీపీ సింధు శర్మ.
నిజామాబాద్ ( ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 30
నూతన సంవత్సర సంబరాలలో భాగంగా పోలీస్ శాఖ పలు ఆంక్షలు విధించింది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ సీపీ సింధు శర్మ సోమవారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లో డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఆమె సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మద్యం సేవించి వాహనాలను నడప రాదన్నారు ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సమయం వరకు మద్యం షాపులు, బార్లు తెరిచి ఉంచుకోగలరన్నారు. సమయానికి మించి మధ్యం అమ్మకాలు జరిపితే వారి లైసెన్సులను రద్దు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అదేవిధంగా బార్లు,రెస్టారెంట్లు సమయం మించిన తర్వాత తెరిచి ఉంచితే వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలను భయాందోళనకు గురి చేసే విధంగా క్రాకర్స్, ఆర్కెస్ట్రా, డిజె సౌండ్ సిస్టంలను నిషేధించడం జరిగిందన్నారు. ఇందుకోసం నిజామాబాద్ నగరంలో ప్రత్యేకంగా 20 పోలీసు బృందాలను ఏర్పాటుచేసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడతామన్నారు. అర్ధరాత్రి 12:30 తర్వాత రోడ్డుమీద ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. వైన్ షాప్ లలో, బహిరంగ ప్రదేశాలలో సిట్టింగ్లు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా జరుపుకోవాలని ఆమె సూచించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.