కలెక్టర్ పై దాడి పేరుతో అమాయక దళిత,గిరిజన రైతులను వెధించవద్దు

కలెక్టర్ పై దాడి పేరుతో అమాయక దళిత,గిరిజన రైతులను వెధించవద్దు

రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

సిద్దిపేట నవంబర్ 25 ప్రశ్న ఆయుధం :

కలెక్టర్ పై దాడి పేరుతో అమాయకులైన దళిత,గిరిజన రైతులను వెధించవద్ద ని,కలెక్టర్ పై దాడి సమర్దినియం కాదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.సోమవారం ఎస్సీ ఎస్టీ కమిషన్ లగచర్ల, రొటిబండ తండాలలో పర్యటించి ఫార్మా కంపెనీల భూ నిర్వాసితులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ భూసేకరణ చట్టం 2023 ప్రకారం నొటిపికేషన్,పబ్లిక్ హియరింగ్ సమయంలో ముందస్తు సమాచారం ఇచ్చారా అని రైతులను అడగగా మాకు సమాచారం ఇవ్వలేదన్నారు. భూమికి భూమి ఇవ్వాలని, నష్టపరిహారం, పునరావాసం కల్పించాలని భూ సేకరణ చట్టం పై అవగహన కల్పించారు. ఈ సంఘటన పై ముఖ్యమంత్రి దృష్టి కి తీసుక వెళ్ళుతనానని హమి ఇచ్చారు. భూమి రిజిస్ట్రేషను ధరలును సవరించాలన్నారు. గిరిజనులు భయాందోళనలో వున్నారని,వారిని వెధించవద్దని పొలీసులను అదేశించారు.గ్రామాలలో ప్రశాంత వాతవారణాన్ని నెలకొల్పాలన్నారు.ఈ కార్యక్రమం లో కమిషన్ సభ్యులు నీలాదేవి, రాముబాబు నాయక్,జిల్లా శంకర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు. మా భూములు ఇవ్వం ఫార్మ కంపెనీలకు భూములు ఇవ్వమని రైతులు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కు విన్నవించారు.భూములు తీసుకుంటె ఎలా బతకాలని అవేదన వ్యక్తం చేశారు. మా ఇళ్ళ పై అర్ధరాత్రి దాడి చెసి అక్రమంగా అరెస్టు చేసారని చెప్పారు. అక్రమంగా నమోదు చెసిన కేసులను ఎత్తివేయాలని గిరిజన మహిళలు కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment