వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టొద్దు
– ఎమ్మార్పీఎస్ టిఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్
*సిద్దిపేట, నవంబర్ 28
ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయకుండా ఉద్యోగ నియామకాలు చేయకూడదని ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధంగా చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 19న హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన మాదిగల మహాగర్జన కార్యక్రమం కరపత్రికను సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 12 లక్షల రూపాయల అభయాస్త పథకం వెంటనే అమలు చేయాలని కోరారు. డప్పు చెప్పు వృత్తిదారులకు నెలకు 4000 రూపాయల పెన్షన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణతో పాటు పలు డిమాండ్ల సాధన కోసం జనవరి 19న హైదరాబాద్లో నిర్వహించే తలపెట్టిన మాదిగల మహాగర్జనకు సిద్దిపేట నుండి భారీగా తరలి వెళ్లేందుకు జిల్లా వ్యాప్తంగా స్కూటర్ ర్యాలీ చేపట్టి మాదిగల అందరిని సంసిద్ధం చేస్తున్నామన్నారు. జనవరి 19న మాదిగల మహాగర్జనకు సిద్దిపేట జిల్లా నుండి భారీగా మాదిగలందరూ తరలి వెళ్తున్నామన్నారు. మాదిగల అందరూ ఏకమై ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా మహాగర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు.