*పిల్లల పట్ల అలసత్వం వద్దు సొంత వైద్యం మానుకొని డాక్టర్ను సంప్రదించండి*
*చిల్డ్రన్ డాక్టర్ రవి వర్మ*
*ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్*
*హుజరాబాద్ జూలై 13 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ఆదివారం రోజున ఉచిత హెల్త్ చెకప్ ని, విజేత చిల్డ్రన్స్ హాస్పిటల్ ఆదిత్య ఐ కేర్ వారి సహకారంతో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకి పిల్లల వైద్య నిపుణుడైన గాదం గంధం రవివర్మ పిల్లలను పరీక్షించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సమస్యల ఆధారంగా పిల్లలకు ఉచిత మందులు అందించారు. కంటి పరీక్షలు, రక్త నమూనాలు సేకరించి బ్లడ్ గ్రూప్ తెలియజేశారు పిల్లల వైద్య నిపుణులు మాట్లాడుతూ విద్యార్థులు బలమైన ఆహారం తీసుకోవాలని, పిల్లలకు సెల్ ఫోన్ ని దూరంగా ఉంచాలని, అలాగే చిన్న సమస్యలకు సైతం సొంత వైద్యం చేయకుండా, డాక్టర్ ని సంప్రదించాలని తెలియజేశారు తదనంతరం ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు సరైన ఆహారం తీసుకుంటే ఎదుగుదల బాగుంటుందని ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని, అలాంటప్పుడే విద్యార్థుల హాజరు శాతం కూడా ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని, అప్పుడే చక్కగా నేర్చుకుంటారని తెలియజేశారు. తదనంతరం ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ రవివర్మ, అలాగే హాస్పిటల్ యాజమాన్యాన్ని శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజేత హాస్పిటల్స్ నిర్వాహకుడు దేవేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది ఆదిత్య ఐ కేర్ సిబ్బంది అనిల్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.